తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించిన మిథాలీ.. సౌతాఫ్రికా లక్ష్యం 189 - భారత్-దక్షిణాఫ్రికా వార్తలు

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 188 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 79 పరుగులతో రాణించింది.

mithali
మిథాలీ

By

Published : Mar 17, 2021, 12:36 PM IST

దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరుగుతోన్న చివరిదైన ఐదో వన్డేలోనూ భారత మహిళల పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 188 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లు ప్రియా పూనియా (18), స్మృతి మంధానా (18)కి తోడు పూనర్ రౌత్ (10), హేమలత (2), సుష్మ వర్మ (0) విఫలమయ్యారు. హర్మన్​ప్రీత్ కౌర్ (30) పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగింది.

మిథాలీ పోరాటం

సిరీస్​లో తన ఫామ్​ను కొనసాగిస్తూ మరోసారి సత్తాచాటింది సారథి మిథాలీ రాజ్. ఓవైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. 104 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్​గా నిలిచింది. ఫలితంగా టీమ్ఇండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో నదీన్ క్లర్క్ 3 వికెట్లతో రాణించగా, షంగేస్ 2, సేఖుఖునే 2, మరిజన్నే ఒక వికెట్ దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details