తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​కు మరో చురుకైన పేసర్ అవసరం' - cricket

ప్రపంచకప్​లో భారత బౌలింగ్ దళం కూర్పుపై స్పందించాడు గౌతమ్​ గంభీర్. పేసర్​ లోటు స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషించాడు.

గంభీర్

By

Published : May 15, 2019, 3:23 PM IST

ప్రపంచకప్​లో భారత బౌలింగ్​లో మరో నాణ్యమైన పేసర్ ఉంటే బాగుండేదని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడున్న పేసర్లకు మరొకరి మద్దతు లభిస్తే బౌలింగ్ దళం మరింత పటిష్ఠంగా తయారవుతుందని అన్నాడు.

"భారత్ బౌలింగ్​లో మరో పేసర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బుమ్రా, షమీ, భువనేశ్వర్​కు మరింత మద్దతు అవసరం. హార్దిక్ పాండ్య, విజయ్ శంకర్ రూపంలో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని మీరు అనొచ్చు.. కానీ నేను ఏకీభవించను".
-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్

ప్రస్తుతం గంభీర్ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో చేరాడు. సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు దిల్లీ లోక్​సభ నియోజవర్గం నుంచి భాజపా తరపున పోటీ చేశాడు. ముంబయిలో జరిగిన సియెట్ క్రికెట్ రేటింగ్ ఇంటర్నేషనల్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాడు.

"ఈసారి ప్రపంచకప్​ ఫార్మాట్ చాలా బాగుంది. ప్రతి జట్టు మరో జట్టుతో ఆడటం వల్ల మంచి ప్రదర్శన చేసిన టీమ్​కే ట్రోఫీ లభిస్తుంది. భవిష్యత్ ప్రపంచకప్​లనూ ఐసీసీ ఇదే పద్ధతిలో నిర్వహించాలి".
-గంభీర్, భారత మాజీ క్రికెటర్

ప్రపంచకప్​లో మీరు ఫేవరేట్లుగా భావిస్తున్న జట్లేవి అన్న ప్రశ్నకు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్​కు ట్రోఫీ గెలిచే సత్తా ఉందని సమాధానం ఇచ్చాడు గంభీర్. టీమిండియా తర్వాత ఆసీస్ అన్ని రకాలుగా పటిష్ఠంగా ఉందని.. న్యూజిలాండ్, ఇంగ్లండ్​ కూడా బలమైన జట్లని తెలిపాడు.
ఇప్పటికే రెండు సార్లు ప్రపంచకప్​ గెలిచిన ఇండియా తొలిమ్యాచ్​లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.

ఇవీ చూడండి.. 'అతడి ప్రతిభకు దరిదాపుల్లో ఎవరూ లేరు'

ABOUT THE AUTHOR

...view details