తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్యాట్​తో మళ్లీ రెచ్చిపోయిన యశస్వి జైస్వాల్ - ఐపీఎల్ 2020

భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్.. మరోసారి బ్యాటుతో రెచ్చిపోయాడు. సీకే నాయుడు ట్రోఫీలో పాండిచ్చేరి జట్టుపై 185 పరుగులతో అదరగొట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు.

బ్యాట్​తో మళ్లీ రెచ్చిపోయిన యశస్వి జైస్వాల్
భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్

By

Published : Feb 23, 2020, 8:05 PM IST

Updated : Mar 2, 2020, 8:01 AM IST

అండర్-19 ప్రపంచకప్​లో​ అదరగొట్టిన భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్.. ఆ తర్వాత ఆడిన తొలి మ్యాచ్​లోనే దుమ్ములేపాడు. అండర్-23 సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా పాండిచ్చేరితో జరుగుతున్న పోరులో కొద్దిలో ద్విశతకం మిస్​ చేసుకున్నాడు. గతంలో లిస్ట్-ఏ క్రికెట్​లో డబుల్​ సెంచరీ చేసిన పిన్న వయసు క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు యశస్వి.

వాంఖడే వేదికగా పాండిచ్చేరితో జరిగిన ఈ మ్యాచ్​లో 185 పరుగులు చేశాడు జైస్వాల్. ఇందులో 19 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి.

యశస్వి జైస్వాల్

అండర్-19 ప్రపంచకప్​లో 400 పరుగులు చేసిన యశస్వి.. 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచాడు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నాడు జైస్వాల్. అతడిని వేలంలో రూ.2.4 కోట్ల భారీ ధర పెట్టి కొనుక్కుందీ ఫ్రాంచైజీ.

Last Updated : Mar 2, 2020, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details