ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు జట్టు ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సహాయక సిబ్బంది దుబాయ్ వెళ్లనున్నారు. రవిశాస్త్రి సోమవారం బయలుదేరుతుండగా.. మిగతా వారు ఆదివారం వెళ్లనున్నారు. అక్కడికి చేరుకోగానే ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. ఐపీఎల్ అనంతరం టీమ్ఇండియా బృందం ఆస్ట్రేలియాకు వెళ్తుంది.
నవంబర్లో జరగబోయే ఆస్ట్రేలియా-భారత్ పరిమిత ఓవర్ల సిరీస్కు.. సిడ్నీ, కాన్బెర్రా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మైదానాల్లోనే మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి ఇరుజట్లు.