బౌలింగ్ లైనప్ బలంగా ఉన్న కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భారత్ రాణించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్. బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ కోసం నవంబర్‌లో ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది టీమ్ఇండియా.
"వారికున్న ఉత్తమ బౌలింగ్ ఎటాక్‌తో భారత్ ఆస్ట్రేలియాకు బలమైన పోటీ ఇస్తుందని ఆశిస్తున్నా. ఎందుకంటే బలమైన బౌలింగ్ లైనప్ లేకుండా ఆసీస్‌తో తలపడటం కష్టం. టీమ్ఇండియాను కొన్నేళ్లుగా గమనిస్తే ఆ జట్టు తయారు చేసే ఫాస్ట్ బౌలర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1993లో నేను భారత గడ్డపై ఆడిన సమయంలో ఆ జట్టులో ఎక్కువమంది స్పిన్నర్లే ఉండేవారు. ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నా.. ఇప్పుడున్నంత లోతైన పేస్ ఎటాక్ లేదు".