మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో వర్షం పడిన కారణంగా ఆదివారం జరగాల్సిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ రద్దయ్యింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.
మైదానంలో ప్రాక్టీస్ లేనందున జిమ్లో ఆటగాళ్లు చెమట చిందించారని బోర్డు తెలిపింది. జనవరి 7న జరిగే మూడో టెస్టు కోసం ఇరు జట్లు సిడ్నీకి సోమవారం బయలుదేరనున్నాయి.