ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం టీమ్ఇండియా తీసుకున్న అర్థరహిత నిర్ణయమని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నాడు. "భారత్ తీసుకున్న అర్థరహిత నిర్ణయమిది. గాయాలతో ఆటగాళ్లు దూరమైనా, స్వదేశంలో టెస్టులు జరుగుతున్నా... కుల్‌దీప్‌ను జట్టులోకి తీసుకోలేదు. ఇక అతడు ఎలాంటి సందర్భాల్లో జట్టులో ఉంటాడు?" అని వాన్ ట్వీట్ చేశాడు.
'అది టీమ్ఇండియా అర్థరహిత నిర్ణయం' - కుల్‌దీప్‌కు నిరాశే
భారత్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టాడు మాజీ క్రికెటర్ మైకేల్ వాన్. ఇది టీమ్ఇండియా తీసుకున్న అర్థరహిత నిర్ణయమని వ్యాఖ్యానించాడు.

'అది టీమ్ఇండియా అర్థరహిత నిర్ణయం'
గాయంతో జడేజా జట్టుకు దూరమవ్వడంతో కుల్‌దీప్ జట్టులో ఉంటాడని భావించినట్లు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా అన్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కుల్‌దీప్‌కు చోటు దక్కలేదు. రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు యువ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, షాబాజ్ నదీమ్ జట్టులో చోటు సంపాదించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలోనూ కుల్‌దీప్‌కు నిరాశే మిగిలింది. నాలుగు టెస్టుల్లోనూ అతడికి అవకాశం రాలేదు. 2019 జనవరిలో సిడ్నీ వేదికగా కుల్‌దీప్ ఆఖరి టెస్టు ఆడాడు.