భారత క్రికెట్లో లాక్‌డౌన్‌కు ముగింపు పలకనున్నారు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్‌ను ఆహ్వానించి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. తమ అభిమాన క్రికెటర్ల ఆటను స్వదేశంలో చూడనున్నారని బోర్డు అధికారి చెప్పారు.
"ఐపీఎల్‌ను యూఏఈలో జరిపేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం. త్వరలో ఇది జరుగుతుందని అనుకుంటున్నాం" -బీసీసీఐ అధికారి