తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రియ పునియా విధ్వంసం​​... టీమిండియా ఘన విజయం - Priya Punia and Jemimah Rodrigues

వడోదర వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల తొలి వన్డేలో ఘన విజయం సాధించింది టీమిండియా. బుధవారం జరిగిన ఈ మ్యాచ్​లో.. భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్​లో ప్రియ పునియా, జెమినా రోడ్రిగ్స్​ అర్ధశతకాలతో రాణించారు.

ప్రియ పునియా విధ్వంసం​​... టీమిండియా ఘన విజయం

By

Published : Oct 9, 2019, 8:00 PM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారీ విజయం సాధించింది మహిళా టీమిండియా. వడోదర వేదికగా బుధవారం జరిగిన పోరులో... ప్రియ పునియా, జెమినా రోడ్రిగ్స్​ అర్ధశతకాలతో రాణించారు. ఫలితంగా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత జట్టు. మూడు వన్డేల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అరంగేట్రంలోనే అదుర్స్​...

వన్డేల్లో అరంగేట్రం చేసిన ప్రియ పునియా... మొదటి మ్యాచ్​లోనే దుమ్ములేపింది. 124 బంతుల్లో 75 పరుగులు చేసింది. ఇందులో ఎనిమిది బౌండరీలు ఉన్నాయి. మరో బ్యాట్స్​ఉమన్​ జెమీమా రోడ్రిగ్స్ 65 బంతుల్లో 55 పరుగులతో మంచి సహాకారం అందించింది.

ప్రియ పునియా

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మహిళల జట్టు... 45.1 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలోనే సఫారీ జట్టుకు గోస్వామి ఊహించని షాకిచ్చింది. తొలి ఓవర్‌ తొలి బంతికే లిజాలే లీ(0) ఔట్​ చేసింది. 56 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును.... లారా వోల్వార్ట్(39), త్రిషా శెట్టి(14) ఆదుకున్నారు. మళ్లీ భారత బౌలర్లు చెలరేగడం వల్ల 164 పరుగులకే ఆలౌటైంది ప్రొటీస్​ జట్టు. భారత బౌలర్లలో జులాన్ గోస్వామి(3/33), శిఖా పాండే(2/38), ఏక్తా బిస్త్​(2/8), పూనం యాదవ్(2/33) సత్తా చాటారు.

జెమీమా రోడ్రిగ్స్

అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని 41.4 ఓవర్లలోనే ఛేదించింది భారత మహిళల జట్టు. గాయం కారణంగా దూరమైన స్మృతి మంధాన స్థానంలో బరిలోకి దిగింది ప్రియ పునియా. తొలి మ్యాచ్​లోనే అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. ఇప్పటివరకు కేవలం మూడు టీ20లు మాత్రమే ఆడిందీ 23 ఏళ్ల జైపూర్‌ క్రీడాకారిణి.

ABOUT THE AUTHOR

...view details