తెలంగాణ

telangana

ETV Bharat / sports

చివరి వన్డేలోనూ భారత మహిళల ఓటమి

సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలోనూ మిథాలీ సేన ఓటమి పాలైంది. ఐదు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను దక్షిణాఫ్రికా.. 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

Indian women lose 5th ODI to South Africa by 5 wickets, concede series 1-4
చివరి వన్డేలోనూ భారత్ ఓటమి.. 4-1తో సిరీస్​ ప్రోటీస్ కైవసం

By

Published : Mar 17, 2021, 4:38 PM IST

Updated : Mar 17, 2021, 4:55 PM IST

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో భారత్ ఓటమి పాలైంది. ఐదు మ్యాచ్​ల సిరీస్​ను 4-1 తేడాతో గెలుచుకుంది ప్రొటీస్ జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్​ఇండియా.. 49.3 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిథాలీ (79*), హర్మన్​ప్రీత్ కౌర్ (30 రిటైర్డ్​ హర్ట్​) మినహా ఎవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నాడిన్ డి క్లర్క్ 3, తుమి 2, నోండుమిసో షాంగెస్ 2 వికెట్లతో రాణించారు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన సౌతాఫ్రికా 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిగ్నాన్ డు ప్రీజ్, అన్నేకే బాష్​లు అర్ధ సెంచరీలతో రాణించారు. టీమ్​ఇండియా బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్​ 3 వికెట్లు తీసింది.

లఖ్​నవూ వేదికగా దక్షిణాఫ్రికాతో 3 మ్యాచ్​ల టీ20 సిరీస్​ మార్చి 20న ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:ఐసీసీ ర్యాంకింగ్స్​: 3 ఫార్మాట్లలోనూ టాప్​-5లో కోహ్లీ

Last Updated : Mar 17, 2021, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details