తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాలుగో టీ20లోనూ విజయం అమ్మాయిలదే - gauyana india 4th t20

గయానా వేదికగా విండీస్ మహిళా జట్టుతో జరిగిన నాలుగో టీ20లో భారత అమ్మాయిలు 5 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఇప్పటికే 4-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న మహిళా టీమిండియా.. చివరి మ్యాచ్ నవంబరు 20న ఆడనుంది.

నాలుగో టీ20లోనూ విజయం అమ్మాయిలదే

By

Published : Nov 18, 2019, 12:05 PM IST

వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన నాలుగో టీ20లో భారత అమ్మాయిలు 5 పరుగుల తేడాతో విజయం సాధించారు. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​కు వరుణుడు కాసేపు అడ్డంకిగా మారాడు. ఫలితంగా మ్యాచ్​ను 9 ఓవర్లకు కుదించారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 7 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. బౌలింగ్​కు అనుకూలిస్తున్న పిచ్​పై టీమిండియా అమ్మాయిలు పెద్దగా రాణించలేకపోయారు. పూజ(10) మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. విండీస్‌ బౌలర్లలో మాథ్యూస్‌ (3/13) సత్తా చాటింది. అద్భుత ప్రదర్శన చేసిన మ్యాథ్యూస్​కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్‌ భారత బౌలర్ల ధాటికి నిలువలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 45 పరుగులే చేసింది. అంజు (2/8), దీప్తి శర్మ (1/8), రాధ (1/8) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి.. టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్‌ చివరి మ్యాచ్‌ను నవంబర్‌ 20న ఆడనుంది.

ఇదీ చదవండి: 'ఏటీపీ ఫైనల్స్'​ విజేతగా గ్రీస్ స్టార్ స్టెఫానో సిట్సిపాస్​

ABOUT THE AUTHOR

...view details