తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆసీస్ టూర్​లో కోహ్లీసేనకు రెండు వారాల క్వారంటైన్' - Cricket Australia news

డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే టీమ్​ఇండియాను రెండు వారాలు నిర్బంధంలో ఉండమని కోరుతామని క్రికెట్​ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్​ హాక్లే తెలిపాడు. నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను బయో సెక్యూర్​ వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించాడు.

Indian Test squad may be asked to quarantine in Adelaide before Australia series
'రెండు వారాలు నిర్బంధంలో ఉండమని టీమ్​ఇండియాను కోరుతాం'

By

Published : Jul 21, 2020, 2:57 PM IST

టీమ్​ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది డిసెంబరులో నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ పర్యటన కోసం ఆసీస్​కు భారత జట్టు వచ్చిన తర్వాత వారిని రెండు వారాల పాటు నిర్బంధంలో ఉండమని కోరుతామని క్రికెట్​ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్​ హాక్లే తెలిపాడు.

ఈ సిరీస్​ను బయో సెక్యూర్​ వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా అడిలైడ్​ ఓవల్​తో పాటు కొత్తగా నిర్మించిన హోటల్​లో ఏర్పాట్లు చేస్తున్నామని హాక్లే వెల్లడించాడు. డిసెంబరు 4 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్​లో భారత్​, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

"క్రికెటర్లకు రెండు వారాల నిర్బంధం కోసం కచ్చితమైన ఏర్పాట్లు ఉండాలి. నిర్బంధ వాతావరణంలోనూ ఆటగాళ్లకు శిక్షణా సదుపాయాలు లభించేలా చూడాలి. దీంతో మ్యాచ్​ల కోసం సన్నద్ధమవ్వడానికి వీలవుతుంది. అడిలైడ్​ ఓవల్​లో ఒక హోటల్​ ఉంది. అందులో క్రికెటర్లకు సదుపాయాల ఏర్పాటుకు యోచిస్తున్నాం."

-నిక్​ హాక్లే, క్రికెట్​ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ

"ఆస్ట్రేలియా పర్యటనకు భారత్​ వచ్చే సమయానికి మా దేశంలో అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసే అవకాశం లేదు. కానీ, ఇక్కడ కరోనా టెస్ట్​లు చేయడానికి పక్కా ప్రణాళికలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్బంధ ఏర్పాట్లు ఉంటాయి" అని హాక్లే తెలిపాడు.

కరోనా వైరస్​ విజృంభిస్తున్న కారణంగా ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ ప్రకటనతో ఐపీఎల్​ను నిర్వహించడానికి బీసీసీఐకి మార్గం సుగమమైంది.

ABOUT THE AUTHOR

...view details