ఆరు రోజుల క్వారంటైన్ గడువు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పడ్డారు. సోమవారం సాయంత్రం టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో సాధన చేశారు. క్వారంటైన్‌లో మూడు సార్లు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో ఆటగాళ్లందరి ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. మంగళవారం నుంచి ప్రాక్టీస్ ముమ్మరం కానుంది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు శుక్రవారం ఆరంభం కానుంది.
పరీక్ష ముగిసింది.. ప్రాక్టీస్ మొదలైంది - రోహిత్ శర్మ ప్రాక్టీస్
క్వారంటైన్ గడువు పూర్తి చేసుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు మైదానంలో సాధన చేశారు. కరోనా పరీక్షల్లో ఆటగాళ్లందరికీ నెగిటివ్‌గా తేలడం వల్ల ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
టీమ్ఇండియా
"చెన్నైలో టీమ్‌ఇండియా క్వారంటైన్ గడువు సోమవారంతో ముగిసింది. ఈ సమయంలో కొవిడ్-19 నిర్ధరణ కోసం నిర్వహించిన మూడు ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో ఆటగాళ్లు నెగెటివ్‌గా తేలారు" అని బీసీసీఐ తెలిపింది. తమ ఆటగాళ్లకు కూడా కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని, మంగళవారం సాధన ఆరంభమవుతుందదా జట్టు ప్రతినిధి చెప్పాడు.