బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో తొలి టీ-20లో ఓటమిపాలైన కోహ్లీసేన పొరపాట్లను పునరావృతం చేయకూడదని భావిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో టీ-20 మ్యాచ్ ఆడిన భారత్.. మూడు నెలల తర్వాత ఇంగ్లాండ్‌తో 20 ఓవర్ల మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడని కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, చాహల్ ఈ మ్యాచ్‌తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. ఈ ఒక్క ఓటమితోనే టీమిండియాపై ఓ అంచనాకు రావడం సరికాదు. ప్రతికూల పరిస్థితుల నుంచి పుంజుకుని రాణించడం భారత జట్టుకు కొత్తేమి కాదు. టెస్టు సిరీస్‌లో కూడా అదే జరిగింది.
జట్టుకు ఎక్స్‌ఫ్యాక్టర్‌గా ఉపయోగపడతారని భావిస్తున్న రిషభ్ పంత్, హార్దిక పాండ్య నుంచి గెలుపు ఇన్నింగ్స్‌లను జట్టు ఆశిస్తోంది. వారిద్దరూ అపారమైన ప్రతిభ కలవారన్న కోహ్లీ.. సామర్థ్యం మేరకు ఆడితే గెలుపుబాట పట్టడం పెద్ద కష్టమేమి కాదన్నాడు. ఆర్చర్, మార్క్ వుడ్ బౌలింగ్‌ను పాండ్య, పంత్ సరిగ్గా అంచనా వేయలేకపోయారని, అదనపు బౌన్స్ వల్ల కూడా భారీ షాట్లు ఆడలేకపోయారని చెప్పాడు.
మ్యాచ్ అనంతరం మీడియా తో మాట్లాడిన కోహ్లీ.. ఆశించిన షాట్లు ఆడేందుకు వికెట్ సహకరించలేదన్నాడు. తొలి టీ-20లో 67 పరుగులతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ అదే ఫామ్‌ను కొనసాగించాలని భారత జట్టు కోరుకుంటోంది. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసిన వేళ అయ్యర్ తన ఇన్నింగ్స్ ద్వారా బ్యాటింగ్ చేయడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించాడు.
నిరీక్షణ తప్పదా...