వెన్ను గాయంతో రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా ప్రధాన ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. పునరాగమనం దిశగా అడుగులేస్తున్నాడు. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ పేసర్.. మళ్లీ మైదానంలోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ శిక్షణ సిబ్బందిలో ఒకడైన రజనీకాంత్ శివజ్ఞానం సాయంతో బుమ్రా సాధన చేస్తున్నాడు. ముంబయి క్రికెట్ సంఘానికి చెందిన మైదానంలో అతడి ప్రాక్టీసు సాగుతోంది. వ్యక్తిగత ఒప్పందం మేరకు బుమ్రాతో కలిసి రజనీకాంత్ పనిచేస్తున్నట్లు సమాచారం. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడీ స్టార్ పేసర్.
ఫిట్నెస్ వేటలో బుమ్రా... త్వరలో మైదానంలోకి - బుమ్రా వచ్చేస్తున్నాడోచ్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు దూరమైన బుమ్రా.. డిసెంబర్ 6 నుంచి విండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కూ అందుబాటులో లేడు. అయితే తాజాగా జిమ్‌లో సాధన చేస్తున్న వీడియోను పంచుకున్నాడు.
ఫిట్నెస్ వేటలో బుమ్రా... త్వరలో మైదానంలోకి
ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్‌తో టెస్టులు ఆడిన బుమ్రా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ముంగిట గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఆ సిరీస్‌తో పాటు తర్వాత బంగ్లాతో టీ20లు, టెస్టులకు కూడా అందుబాటులో లేడు. త్వరలో ఆరంభమయ్యే విండీస్ పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ బుమ్రా ఆడట్లేదు. మొత్తంగా నాలుగు నెలల పాటు ఆటకు దూరమవుతున్న ఆ పేసర్.. జనవరి 24న ఆరంభమయ్యే న్యూజిలాండ్ పర్యటన సమయానికి ఫిట్ అవుతాడని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది.