దక్షిణాఫ్రికాతో తొలి వన్డే కోసం భారత ఆటగాళ్లు మంగళవారం ధర్మశాలకు చేరుకున్నారు. అయితే కరోనా వైరస్ భారత్‌లో వ్యాపిస్తోన్న నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విమానంలో ధర్మశాలకు మాస్క్ ధరించి ప్రయాణించాడు. ఫేస్‌మాస్క్‌తో తీసుకున్న సెల్ఫీని అతడు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'మాస్క్‌తో విమాన ప్రయాణం' అనే అర్థం వచ్చేలా ఫొటోకి ఎమోజీలు జతచేశాడు.
చాహల్‌కు 'కరోనా' భయం.. మాస్క్‌తో జాగ్రత్తలు - Yuzvendra Chahal news
కరోనా వ్యాప్తిపై రోజు రోజుకు ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో.. టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఫేస్ మాస్క్‌తో కనిపించాడు. దక్షిణాఫ్రికాతో తొలి వన్డే కోసం ధర్మశాలకు వెళ్తూ విమానంలో తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేశాడీ బౌలర్.
ధర్మశాలకు చేరుకున్న టీమిండియా మంగళవారం కఠోర సాధన చేసింది. నెట్స్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. గాయంతో దాదాపు ఆరు నెలలు జట్టుకు దూరమైన హార్దిక్.. దక్షిణాఫ్రికా సిరీస్‌తోనే పునరాగమనం చేయనున్నాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మార్చి 12న సఫారీసేనతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ జట్టుతో ప్రధాన వైధ్యాధికారి షుయాబ్ మంజ్రా కూడా భారత్‌కు వచ్చాడు. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కరచాలనానికి దూరంగా ఉండాలని ఆ జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ సూచించాడు.