భారత జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రిత్ బుమ్రా చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. శ్రీలంకతో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు ఎంపికైన బుమ్రా... ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. కొన్ని నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఇటీవలే కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరమయ్యాడు. తాజాగా లంక సిరీస్ ముందు బుమ్రా ప్రాక్టీసు వీడియోను షేర్ చేసింది బీసీసీఐ. ఇందులో ఈ పేసర్ తన పదునైన పుల్ డెలివరీతో స్టంప్స్‌ను గిరాటేశాడు.
" బుమ్రా వేసిన డెలివరీని ఎవరైనా చూశారా.. ఎలా ఉంది అతని బౌలింగ్" అని ట్వీట్ చేసింది బీసీసీఐ. అంతేకాకుండా "బుమ్రా తన అస్త్రాలతో సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రదర్శన చూసేందుకు మీరంతా సిద్ధంగా ఉండండి" అని పేర్కొంది.
అరుదైన రికార్డు..
పొట్టి ఫార్మాట్‌లో 51 వికెట్లు తీసిన బుమ్రా లంకతో తలపడే తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీస్తే అరుదైన ఘనత సాధిస్తాడు. భారత్ తరఫున టీ20ల్లో రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ చెరో 52 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బుమ్రా తొలి మ్యాచ్‌లో రాణిస్తే వీరిని అధిగమించే అవకాశం ఉంది.
ఈ సిరీస్‌కు చాహల్ కూడా ఎంపికయ్యాడు. ఇప్పటికే 52 వికెట్లు తీసిన ఈ స్పిన్నర్.. తొలి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకొనే అవకాశాలున్నాయి. తొలి టీ20లో అతను ఒక్క వికెట్ తీసినా అశ్విన్‌ను అధిగమిస్తాడు.
ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం బుమ్రాకు జోడీగా కాంబినేషన్లను ప్రయత్నించనుంది భారత జట్టు యాజమాన్యం. శ్రీలంక సిరీస్‌లో నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ వంటి యువ ఆటగాళ్లు బుమ్రాతో బౌలింగ్ పంచుకునే అవకాశం ఉంది. భువనేశ్వర్, దీపక్ చాహర్ గాయాలతో జట్టుకు దూరమవగా, ఫామ్‌లో ఉన్న మహ్మద్ షమికి ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.