టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. అయితే ఈ నెల 12 నుంచి దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది భారత్. ఈ మ్యాచ్‌ల్లో అయినా రాణించాలని విరాట్ అభిమానులు ఆశిస్తున్నారు.
వచ్చే సిరీస్‌లో కోహ్లీ 133 పరుగులు చేస్తే.. వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అదే జరిగితే వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం సచిన్ తెందుల్కర్ రికార్డు బ్రేక్ అవుతుంది. సచిన్ 300 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, కోహ్లీ ఇప్పటి వరకు 239 ఇన్నింగ్స్‌లే ఆడాడు.