ఆస్ట్రేలియాతో మంగళవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడనుంది కోహ్లీ సేన. ఇప్పటికే జట్టును ప్రకటించింది. అయితే మూడు ఫార్మాట్ల్లో ఫామ్‌లో ఉన్న రోహిత్‌కు సహా ఓపెనర్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ మధ్య కాలంలో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తుండగా... గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన ధావన్.. లంకపై తన ఫామ్ నిరూపించుకున్నాడు. ఫలితంగా ఇద్దరిలో ఎవరిని తుది జట్టులో ఎంపిక చేయాలన్నది కష్టంగా మారింది. ఇందుకోసం కెప్టెన్ విరాట్, టీమిండియా యాజమాన్యం సరికొత్త ప్రణాళిక రచిస్తోంది.
తుది జట్టులో ముగ్గురూ
కంగారూ జట్టుతో వన్డే సిరీస్‌కు ఎంపికైన రోహిత్, రాహుల్, ధావన్... తుది జట్టులోనూ కొనసాగనున్నారట. వీళ్లలో ఓపెనింగ్ జోడీ ఎవరన్నది తర్వాత తేలనుంది. అయితే వన్ డౌన్లో వచ్చే విరాట్... ఈ సిరీస్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఈ నిర్ణయాన్ని కోహ్లీ కూడా స్వాగతించాడు.
"ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు చాలా మంచిది. కాంబినేషన్ ఏదైనా జట్టులో బెస్ట్ ప్లేయర్లు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ముగ్గురూ(రోహిత్, శిఖర్, రాహుల్) తుది జట్టులో ఉండొచ్చు. మైదానంలో ఈ ప్రయత్నం ఎంత లాభిస్తుందో చూడాలి"
-- విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి