తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో అభిమానులకు బదులు 'రికార్డెడ్‌ శబ్దాలు'! - ipl 2020

ఐపీఎల్​ సెప్టెంబర్​ 19 నుంచి ప్రారంభంకానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్​లు జరగనున్నాయి. అయితే ఫ్యాన్స్​ ఉన్న ఫీలింగ్​ కోసం రికార్డెడ్​ శబ్దలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

indian premier league news
ఐపీఎల్​లో అభిమానులకు బదులు 'రికార్డెడ్‌ శబ్దాలు'

By

Published : Sep 13, 2020, 8:12 AM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే అభిమానులు సందోహం. ఇష్టమైన క్రికెటర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే వారంతా కేరింతలు కొడతారు. ఎగిరి గంతులు వేస్తుంటారు. ఈసారి అవేమీ ఉండవు. కరోనా ముప్పుతో వారిని స్టేడియాల్లోకి అనుమతించడం లేదు. ఆటగాళ్లకూ ఇదంతా కొత్తగానే అనిపిస్తోంది.

ఎప్పుడో దేశవాళీ మ్యాచుల్లో జనాలు లేకుండా ఆడేవారు. జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత అభిమానుల మధ్య ఆడటమే వారికి అలవాటవుతుంది. ఫ్యాన్స్‌ ప్రోత్సహిస్తుంటే మరింతగా రెచ్చిపోతుంటారు.

స్టేడియాల్లో అభిమానులు లేరనే ఫీలింగ్‌ను పోగొట్టేందుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు ఈసారి వినూత్నంగా ఆలోచిస్తున్నాయని తెలిసింది. ఐరోపా లీగుల మాదిరిగానే ముందుగానే రికార్డు చేసిన కేరింతలు, అరుపులను వినిపిస్తారని సమాచారం. ఆటగాళ్లు సిక్సర్లు, బౌండరీలు బాదగానే ఉల్లాసినుల కేరింతలను సైతం రికార్డు చేసి వినిపిస్తారట. మరికొన్ని ఫ్రాంఛైజీలైతే అభిమానులతో అనుసంధానం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారి వీడియోలను ప్రదర్శించాలని అనుకుంటున్నాయని తెలిపారు. కుదిరితే ఆన్‌లైన్‌ ద్వారా అభిమానులతో కనెక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని ఐపీఎల్‌ వర్గాలు అంటున్నాయి.

"ఏదో విధంగా తాము ఐపీఎల్‌లో భాగం అవుతున్నామని అభిమానులు సంతోషిస్తారు. స్టేడియంలో లేనప్పటికీ తమను జనాలు అనుసరిస్తున్నారని ఆటగాళ్లూ ఆనందిస్తారు. అభిమానుల కేరింతలను చూడటం కన్నా క్రికెటర్లకు ఏదీ ఎక్కువగా ప్రేరణ ఇవ్వదు" అని ఐపీఎల్‌ అధికారి ఒకరు అన్నారు.

సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ మొదలవుతోంది. ఆరంభమ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ తలపడనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details