ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో సత్తా చాటుతున్నారు. ఐపీఎల్ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న క్రికెటర్లు ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో అదరగొట్టేశారు. మరికొందరు మాత్రం కాస్త నిరాశపరిచారు. డిసెంబర్ 17న ప్రారంభమైన ఈ టోర్నీలో.. ఇప్పటికి 6 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఐపీఎల్లో పాల్గొననున్న ఆటగాళ్ల ప్రదర్శనను ఓసారి చూద్దాం.
టామ్ బాంటన్.. (1 కోటి), కోల్‌కతా
ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్లో బ్యాటింగ్‌తో సంచలనం రేపిన టామ్ బాంటన్.. ఐపీఎల్ వేలంలో కోటి రూపాయలు పలికాడు. ఊహించని రీతిలో అతడిని భారీ ధరకు సొంతం చేసుకుంది కోల్‌కతా నైట్‌రైడర్స్. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో అరంగేట్రంలోనే సత్తా చాటుతున్నాడు. బ్రిస్బేన్ హీట్ తరపున ఆడుతోన్న టామ్.. మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్ధశతకం చేశాడు. 36 బంతుల్లో 64 రన్స్ సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
మిచెల్ మార్ష్.. (2 కోట్లు), హైదరాబాద్
ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆల్‌రౌండర్ ప్రస్తుతం పెర్త్ స్కాచర్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్‌లో 22 బంతుల్లో 56 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్, 6 సిక్సర్లు ఉన్నాయి. 254.55 స్ట్రయిక్ రేటుతో పరుగులు చేశాడు. ఇతడిని రూ. 2 కోట్లకు దక్కించుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.
కేన్ రిచర్డ్సన్.. (4 కోట్లు), బెంగళూరు
ఆసీస్‌కు చెందిన ఈ బౌలర్.. మెల్‌బోర్న్ రెనిగేడ్స్ తరఫున ఆడుతున్నాడు. ఆరంభ మ్యాచ్‌లో 4 వికెట్లు తీశాడు. 5.50 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఇతడిని 4 కోట్ల ధర వెచ్చించి కొనుక్కుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
క్రిస్ జోర్డాన్.. (3 కోట్లు), పంజాబ్
ఇంగ్లాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ జోర్డాన్.. పెర్త్ స్కాచర్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ఇందులో రెండు వికెట్లు తీయడమే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్‌తో 3 క్యాచ్‌లు పట్టి ఆకట్టుకున్నాడు. ఇతడిని రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
మ్యాక్స్‌వెల్.. (10.75 కోట్లు), పంజాబ్