కరోనా మహ్మమారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధిక వాయిదా పడింది. ఈ విషయాన్ని తొలుత ఫ్రాంఛైజీలకు చెప్పిన బీసీసీఐ.. ఈరోజు(బుధవారం) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ నిరవధిక వాయిదా.. సీజన్ నిర్వహణ సందేహమే - ఐపీఎల్ వాయిదా వార్తలు
ప్రముఖ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుత సీజన్.. ఈ ఏడాదిలో జరుగుతుందా? లేదా? అనేది సందేహమే.
ఐపీఎల్
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్.. మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాలి. కానీ ప్రభుత్వ ఆంక్షల కారణంగా విదేశీ ఆటగాళ్లు వచ్చే అవకాశం లేకపోవడం వల్ల టోర్నీని ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. ఇప్పుడు లాక్‌డాన్ మే 3వరకు పెరగడం వల్ల నిరవధిక వాయిదా వేయక తప్పలేదు.
బీసీసీఐకి ఈ ఏడాది సెప్టెంబరు-నవంబరు మధ్యలో మాత్రమే ఐపీఎల్‌ను నిర్వహించే వీలుంది. అదీ టీ20 ప్రపంచకప్‌ను రీషెడ్యూలు చేయడానికి ఐసీసీ, ఆస్ట్రేలియా ఒప్పుకుంటేనే.