తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టుకు లైన్ క్లియర్

మూడో టెస్టుకు ముందు ఆదివారం చేసిన వైద్య పరీక్షల్లో ఇరుజట్ల ఆటగాళ్లకు నెగిటివ్​గా తేలింది. దీంతో టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మైదానంలో దిగడం దాదాపు ఖరారైంది.

Indian players test negative for coronavirus ahead of third test with australia
భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టుకు లైన్ క్లియర్

By

Published : Jan 4, 2021, 8:49 AM IST

Updated : Jan 4, 2021, 9:41 AM IST

టీమ్​ఇండియా క్రికెటర్లకు ఉపశమనం. ఆదివారం చేసిన కొవిడ్ పరీక్షల్లో ఫలితాలు నెగిటివ్​ వచ్చాయి. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఆస్ట్రేలియా క్రికెటర్లకూ నెగిటివ్​గానే తేలింది. దీంతో మూడో టెస్టు నిర్వహణకు మార్గం సుగమైమనట్లే. ఈరోజే ఇరుజట్లు సిడ్నీకి వెళ్లనున్నాయి.

అసలేం జరిగింది?

భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, గిల్, పంత్, సైనీ, పృథ్వీషా.. ఇటీవల మెల్​బోర్న్​లో ఓ రెస్టారెంట్​కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడం వల్ల సదరు క్రికెటర్లు బయో బబుల్ నిబంధనలు అతిక్రమించారంటూ పెద్ద రచ్చ జరిగింది. దీనిపై ఇరుదేశాల బోర్డులు స్పందించినప్పటికీ నెటిజన్లు మాత్రం ఊరుకోవట్లేదు.

టీమ్​ఇండియా బృందం

ఇందులో భాగంగా ఆ ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్​లో ఉంచారు. అనంతరం వారికి జట్టుతో కలిపి వైద్య పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా అందరికీ కరోనా నెగిటివ్​ రావడం వల్ల టెస్టులో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది.

రోహిత్ మెరుస్తాడా?

సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్​తోనే రోహిత్ శర్మ బరిలో దిగుతున్నాడు. అతడికి వైస్​ కెప్టెన్సీ ఇచ్చారు. మరి ఈ సమస్యలు, ఒత్తిడి మధ్య ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ఇప్పటికే తలో టెస్టు గెలిచిన ఇరుజట్లు.. చివరి రెండు మ్యాచ్​ల్లో గెలిచి సిరీస్​ సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి.

Last Updated : Jan 4, 2021, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details