తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత ఆటగాళ్లకే డౌట్​.. బంతిపై ఉమ్మాలా వద్దా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్​తో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. భారత క్రికెట్​ జట్టు చాలా జాగ్రత్తలు పాటిస్తోంది. అయితే తాజాగా టీమిండియా పేసర్​​ భువనేశ్వర్​ కుమార్​ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ఆటగాళ్లు బంతిపై కాస్త ఉమ్మడం తగ్గించాలని అభిప్రాయపడ్డాడు.

Indian players might reduce usage of saliva for shining ball: Pacer Bhuvneshwar
బంతి మీద ఉమ్మడం తగ్గించుకోండి: భువీ

By

Published : Mar 11, 2020, 4:40 PM IST

Updated : Mar 11, 2020, 4:56 PM IST

క్రికెట్​లో ఆటగాళ్లు బంతికి ఉమ్ము రాసి రుద్దుతూ కనిపిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ విధంగా చేయడం తగ్గించాలనుకుంటున్నట్లు చెప్పాడు భారత పేసర్​ భువనేశ్వర్​ కుమార్​. అయితే ఎందుకు ఆ విధంగా ఉమ్మాల్సి వస్తుందో కారణం వెల్లడించాడు. గురువారం నుంచి దక్షిణాఫ్రికా-భారత్​ మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది.

భారత జట్టు

" మేము(ఆటగాళ్లు) బంతిపై ఉమ్మడం పూర్తిగా మానేస్తామని చెప్పట్లేదు. ఎందుకంటే అలా చేయకపోతే బంతి మెరవదు. అప్పడు బ్యాట్స్​మన్​ ఎలా బౌలింగ్​ చేసినా సులభంగా ఎదుర్కొంటాడు. అప్పుడు జనాలే మా బౌలింగ్​పై నిందలు వేస్తారు. అయితే బంతిని ఉమ్ముతో రుద్దడంపై జట్టు సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. అంతేకాకుండా డాక్టర్​ సూచనలనూ పాటిస్తాం"

-- భువనేశ్వర్​ కుమార్​, టీమిండియా పేసర్​

ఇప్పటికే భారత్​లో 40 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్​ ప్రభావం కారణంగా.. అభిమానులకు కరచాలనం చేయొద్దని భారత ఆటగాళ్లకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి...

తొలి వన్డేకు అటు వర్షం ముప్పు.. ఇటు కరోనా ప్రభావం

Last Updated : Mar 11, 2020, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details