దేశవాళీ క్రికెట్లో గత రెండు-మూడేళ్లుగా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నా.. తనను కావాలనే జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదని అభిప్రాయపడ్డాడు భారత స్టార్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ఆటకు ఎందుకు వీడ్కోలు పలకాల్సి వచ్చిందో ఇటీవలె స్పష్టం చేశాడు.
"జట్టులోంచి నన్ను తొలగించినప్పుడు చివరి వన్డే, టీ20ల్లో నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వచ్చాయి. శస్త్రచికిత్స చేయించుకున్న వృద్ధిమాన్ సాహా ఏడాది తర్వాత జట్టులోకి వచ్చాడు. ఈ లోపు రిషభ్ పంత్ రెండు శతకాలు బాదేశాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐనా సరే సాహాకు అవకాశం ఇచ్చారు. కొందరికి అండ దొరుకుతుంది. కొందరికి దొరకదు. కొందరు అదృష్టవంతులు. కొందరు కాదు. నేను దురదృష్టవంతుల జాబితాలో ఉన్నాను"
పరుగులిచ్చే సమయంలో బంతి ఇస్తే...
"పఠాన్ బంతిని స్వింగ్ చేయడం లేదని చాలామంది విమర్శిస్తే.. ఆ పరిస్థితులను జట్టు మార్చాల్సింది. కానీ అలా చేయలేదు. 10-15 ఓవర్ల తర్వాత బంతి ఇస్తే స్వింగ్ చేయలేం. నా పాత్రను మార్చారు. దాడి చేస్తున్న బౌలర్‌కే కెప్టెన్ బంతినిచ్చి పరుగులు నియంత్రించమంటే ఏం చేస్తారు? ఎక్కువ వైవిధ్యం చూపించాల్సి వస్తుంది. కట్టర్లు వేయాల్సి ఉంటుంది. మరి ఎక్కువ కట్టర్లు వేస్తే బౌలింగ్ మారుతుంది కదా. సాధన చేసేటప్పుడూ అవే బంతులు వేయాలి. నా పాత్రను మార్చారు సరే ప్రోత్సాహం అందించాలి కదా. అదే జరగలేదు" అని పఠాన్ వాపోయాడు.
టీమ్ ఇండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్
"శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత టీమ్‌ఇండియా న్యూజిలాండ్ వెళ్లింది. ఐదు వన్డేల సిరీస్‌లో 3-0తో ముందంజలో నిలిచింది. నేను ఒక్క దాంట్లోనూ ఆడలేదు. ఒక మ్యాచ్ వర్షార్పణం అయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా అవకాశం ఇవ్వలేదు. నా ఆటను మెరుగుపర్చుకొనేందుకు ఏం చేయాలని అప్పుడు కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ను అడిగాను. నేను బ్యాటింగ్, బౌలింగ్ బాగా చేస్తున్నానని ఆయన చెప్పాడు. కానీ కొన్ని అంశాలు తన చేతిలోనూ ఉండవన్నాడు" అని పఠాన్ తెలిపాడు.
మహీ చెప్పినట్లు వార్తలు..!
"2008 ఆస్ట్రేలియా పర్యటనలో నేను బాగా బౌలింగ్ చేయలేదని మీడియాలో మహీ భాయ్ ప్రకటన వచ్చింది. నిజానికి సిరీస్ సాంతం నేను బాగానే బౌలింగ్ చేశాను. సాధారణంగా మీడియాలో ద్వంద్వార్థాలతో వార్తలు వస్తాయి. అందుకే మహీని దానిపై వివరణ కోరాను. అలా చెప్పలేదని, అంతా ప్రణాళిక ప్రకారమే సాగుతోందని అతడు చెప్పాడు. అలాగంటే అంతా బాగుందనేగా నమ్ముతాం. ప్రతిసారి వెళ్లి వివరణ అడగలేం కదా. పదేపదే అలా చేస్తే ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. ఊరికే ఇంకొకరి గదికి వెళ్లి ఏదో ఒకటి చెబుతూ ఉండటం నా పని కాదు. క్రికెటర్ మైదానంలోకి వెళ్లాలి. ఆడాలి. ఆటపైనే దృష్టిపెట్టాలి. బాగా ఆడుతుంటే ప్రోత్సహించాలి. అలా లేదంటే ఆటగాడు ఎంత గొప్పవాడైనా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది" అని పఠాన్ ముగించాడు.
29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడిన పఠాన్.. అన్ని ఫార్మాట్లలో కలిపి 301 వికెట్లు తీశాడు. బ్యాట్‌తోనూ రాణించిన ఇతడు కెరీర్లో 2,821 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 11 అర్ధశతకాలు ఉన్నాయి. 2012 శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిగా టీమ్ ఇండియా తరఫున బరిలోకి దిగాడు. టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్లలో ఒకడిగా పేరుతెచ్చుకున్న ఈ పేసర్.. ఈ ఏడాది జనవరిలో అన్ని ఫార్మాట్లకు ముగింపు పలికాడు.
పాకిస్థాన్‌పై హ్యాట్రిక్ తీసిన ఆనందంలో - పురుష క్రికెటర్లకే సవాల్ విసిరే రికార్డులు వీరి సొంతం!
- 'ధోనీ వల్ల అవకాశం లేకుండా పోయింది'