తెలంగాణ

telangana

ETV Bharat / sports

భువీకి గాయం.. శార్దుల్​ ఠాకూర్​కు చోటు..! - Bhuvneshwar Kumar to miss ODI series

వెస్టిండీస్​​తో వన్డే సిరీస్​ ముందు కోహ్లీసేనకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా పేసర్​ భువనేశ్వర్​ కుమార్​ గాయం కారణంగా ఈ మూడు మ్యాచ్​లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇతడి స్థానంలో శార్దుల్​ ఠాకూర్ జట్టులోకి రానున్నాడు.

shardul replace bhuvi
భారత్​-విండీస్: వన్డే సిరీస్​కు​ భువీ స్థానంలో శార్దుల్​ థాకుర్​!

By

Published : Dec 13, 2019, 8:27 PM IST

వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ గెలిచి జోరుమీదున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ఇతడి స్థానంలో శార్దుల్​ ఠాకుర్​కు చోటు లభించనుంది.

శార్దుల్​ థాకుర్

యాజమాన్యానికి ఫిర్యాదు..!

విండీస్‌తో నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌ తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని బీసీసీఐ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు భువీ. ఇటీవలే వెన్ను నొప్పి వల్ల మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. కోలుకుని ఒక సిరీస్‌ ఆడాడో లేదో మళ్లీ గాయం తిరగబెట్టింది. మున్ముందు కీలక సిరీస్​లు సహా టీ20 ప్రపంచకప్​ ఉండటం వల్ల అతడిని కరీబియన్లపై ఆడించే సాహసం చేసే అవకాశం లేదని సమాచారం.

భువనేశ్వర్​

గాయాలతోనే సగం...

రెండేళ్లుగా భువీ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత అతడు టెస్టు సిరీస్‌లు ఆడలేదు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌లకు అందుబాటులో లేడు. ఆ తర్వాత కోలుకొని జట్టులోకి వచ్చినా అంతగా ప్రభావం చూపించలేదు.

2019 వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ మ్యాచ్​లో గాయపడినా టోర్నీలో కొనసాగాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లు ఆడలేదు. మూడు నెలల విరామం తర్వాత విండీస్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. తాజాగా మళ్లీ అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేయడం వల్ల ఇతడికి విశ్రాంతి నివ్వచ్చని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details