తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ క్రికెటర్​ను ఔట్​ చేయడం వల్ల కోటీశ్వరుడైన భువీ? - indian pacer bhuvi

భారత జట్టు పేసర్​​ భువనేశ్వర్​ కుమార్ మైదానంలో తనదైన బంతులతో బ్యాట్స్​మెన్​ను ముప్పతిప్పలు పెడతాడు. అయితే తనను మాత్రం కెరీర్​ ఆరంభంలో కష్టాలు ఇబ్బందిపెట్టాయని చెప్పుకొచ్చాడు. తన తొలి జీతం గురించి తొలిసారి బహిర్గతం చేశాడు.

bhuvi latest news
ఆ క్రికెటర్​ను ఔట్​ చేయడం వల్ల కోటీశ్వరుడైన భువీ?

By

Published : Jul 14, 2020, 7:14 PM IST

టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఇప్పుడైతే కోట్లలో సంపాదిస్తున్నాడు కానీ ఒకప్పుడు అందరి క్రికెటర్ల లాగే అవకాశాల కోసం ఎదురు చూశాడు. తాజాగా ఓ నెటిజన్‌ అతడి తొలి సంపాదన ఎంత అని అడగ్గా భారత పేసర్‌ స్పందించాడు. తన తొలి సంపాదన రూ.3000 అని, అందులో కొంచెం షాపింగ్‌ చేయగా, మరి కొంత డబ్బును పొదుపు చేశానని గుర్తుచేసుకున్నాడు.

సచిన్​ వికెట్​ రాత మార్చింది..!

2012 డిసెంబర్‌లో టీమ్‌ఇండియాలో అడుగుపెట్టిన ఈ పేస్‌ బౌలర్‌ పాకిస్థాన్‌తో తొలి టీ20 ఆడాడు. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరోవైపు రంజీల్లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను డకౌట్‌ చేసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాస్టర్​ను ఔట్​ చేయగా.. క్రికెట్​ ప్రపంచం కళ్లు భువీపై పడ్డాయి. అలా వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టిన ఈ పేసర్..​ అంచెలంచెలుగా ఎదుగుతూ జట్టులో మంచి బౌలర్‌గా పేరుతెచ్చుకున్నాడు.

2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక అదే ఏడాది ట్రైనేషన్‌ సిరీస్‌లో శ్రీలంకపై 4/8 అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో చివరి టీ20 ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌, శ్రీలంకతో పొట్టి సిరీస్‌ ఆడలేదు. కాగా, ఈ ఏడాదికి బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్టులో భువనేశ్వర్‌ ఏ గ్రేడ్‌లో ఉన్నాడు. దీంతో అతడి వార్షిక ఆదాయం రూ.5 కోట్లుగా తేలింది.

ABOUT THE AUTHOR

...view details