తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒకప్పటి విండీస్​ పేసర్లలా భారత బౌలర్లు: లారా - lara praise temindia pacers

టీమిండియా పేస్ దళంపై ప్రశంసలు కురిపించాడు వెస్టిండీస్ మాజీ దిగ్గజం లారా. వీరు ఒకప్పటి విండీస్ జట్టును తలపిస్తున్నారని అన్నాడు.

లారా

By

Published : Oct 18, 2019, 5:41 AM IST

ప్రస్తుత టీమిండియా పేసర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు వెస్టిండీస్ మాజీ ఆటగాడు లారా. వారు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారని కొనియాడాడు. వీరు ఒకప్పటి విండీస్ పేసర్లను తలపిస్తున్నారని అన్నాడు.

"భారత్ పేస్ అటాక్ అద్భుతంగా రాణిస్తోంది. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో వారు గొప్ప బౌలింగ్ ప్రదర్శనను కనబర్చారు. ముఖ్యంగా.. బుమ్రా, షమీ, ఉమేశ్‌ నిలకడగా రాణించారు. భువనేశ్వర్ వారితో చేరితే తిరుగుండదు. ఈ తరహా బౌలింగ్ బలం 1980-90లో వెస్టిండీస్‌కు ఉండేది. రిజర్వ్ బెంచ్‌లో కూడా నాణ్యమైన బౌలర్లు ఉండటమనేది.. జట్టు సామర్థ్యానికి నిదర్శనం"

-లారా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్

దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌లోనే కాదు.. గతేడాదీ భారత పేసర్లు అద్భుతంగా రాణించారు. ఎంతలా అంటే.. 2018లో జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ ఏకంగా 142 టెస్టు వికెట్లు పడగొట్టారు. మరే జట్టు ఫాస్ట్ బౌలర్లూ ఈ తరహాలో నిలకడగా రాణించలేదు. తాజాగా గాయంతో సఫారీలతో సిరీస్‌కి బుమ్రా దూరమవగా.. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ కూడా అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తున్నాడు.

టీమిండియా సారథి కోహ్లీని మెచ్చుకున్నాడు లారా. అతనో అత్యుత్తమ కెప్టెన్​ అని వ్యాఖ్యానించాడు. ఇటీవలే టెస్టుల్లో ఓపెనర్​గా స్థానం సంపాదించిన రోహిత్​.. అన్ని ఫార్మాట్లలోనూ విజయవంతమైన ఆటగాడని కొనియాడాడు.
ఇవీ చూడండి.. 'పుల్వామా' అమరవీరుల పిల్లలకు సెహ్వాగ్​ శిక్షణ

ABOUT THE AUTHOR

...view details