కరోనా లాక్‌డౌన్ కారణంగా స్పాన్సర్‌షిప్‌లు వచ్చే పరిస్థితి లేదని.. క్రీడా కార్యకలాపాల పునరుద్ధరణకు చేయూత అందించాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోరింది. జాతీయ క్రీడా సమాఖ్యలకు, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు రూ.200 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
'రూ.200 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించండి' - భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) న్యూస్
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా సంక్షోభం కారణంగా స్పాన్సర్‌షిప్‌లు వచ్చే పరిస్థితి లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. క్రీడా కార్యకలాపాలకు రూ.200 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖను కోరింది.

'రూ.200 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించండి'
ఐఓఏకు రూ.10 కోట్లు, ఒలింపిక్ క్రీడా సమాఖ్యలకు రూ.5 కోట్లు చొప్పున, ఒలింపికేతర క్రీడా సమాఖ్యలకు రూ.2.5 కోట్లు చొప్పున, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు రూ.1 కోటి చొప్పున కేటాయించాలని కోరుతూ క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బాత్రాకు లేఖ రాశారు.
ఇదీ చూడండి.. వచ్చే నెల నుంచి దేశవాళీ టోర్నీలు ప్రారంభం!