భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు బీసీసీఐకి లేఖ రాశాడు.
ప్రపంచకప్ స్టాండ్బై ఆటగాడిగా రాయుడు ఉన్నాడు. ఇటీవల గాయాలతో ధావన్, శంకర్ జట్టు నుంచి బయటకు వచ్చినా... రాయుడుకు మాత్రం అవకాశం లభించలేదు. ఈ కారణంతో మనస్తాపానికి గురైన రాయుడు రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.