సిడ్నీ మైదానంలోని భద్రాతా సిబ్బంది తనపై జాత్యహంకార వ్యాఖ్యాలు చేశారని భారత అభిమాని ఒకరు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. 'ఏ దేశానికి చెందినవాడివో అక్కడికే వెళ్లు' అంటూ అన్నట్లు పేర్కొన్నారు. టీమ్ఇండియా క్రికెటర్లు బుమ్రా, సిరాజ్‌లపై ఇదే మైదానంలో జరిగిన జాతివివక్ష ఘటనపై అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు.
ఏం జరిగిందంటే?
సిడ్నీలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కృష్ణ కుమార్.. మూడో టెస్టు చివరి రోజు మ్యాచ్ చూసేందుకు మైదానానికి వెళ్లారు. అంతకు ముందు రెండు రోజులూ టీమ్ఇండియాపై జాతివివక్ష వ్యాఖ్యలకు నిరసనగా.. 'వైరం సరే.. వివక్ష సరికాదు', 'స్నేహితులారా జాతివివక్ష వద్దు', 'బ్రౌన్ ఇన్‌క్లూజన్ మ్యాటర్స్', 'క్రికెట్ ఆస్ట్రేలియా.. మరింత భిన్నత్వానికి చోటివ్వండి' అని రాసున్న బ్యానర్లను ఆయన తీసుకొచ్చారు.