తెలంగాణ

telangana

ETV Bharat / sports

శంషాబాద్​లో సిరాజ్, విహారిల​కు ఘనస్వాగతం - fans Welcomed Siraj at Shamshabad Airport

ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ప్రదర్శన చేసిన హైదరాబాద్​ కుర్రాళ్లు సిరాజ్, హనుమ విహారి శంషాబాద్​ నగరానికి చేరుకున్నారు. శంషాబాద్​ విమానాశ్రయంలో అభిమానులు వారికి ఘనస్వాగతం పలికారు.

Indian cricketers siraj mohammad and hanuma vihari had a grand welcome at shamshabad airport
శంషాబాద్​లో సిరాజ్, విహారిల​కు ఘనస్వాగతం

By

Published : Jan 21, 2021, 12:19 PM IST

Updated : Jan 21, 2021, 1:00 PM IST

ఆస్ట్రేలియా టూర్‌ను ఘ‌నంగా ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన టీమిండియా క్రికెటర్లకు సొంతగడ్డపై ఘనస్వాగతం లభించింది. సిడ్నీ టెస్ట్‌ హీరో హనుమ విహారి, నాలుగో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‎లో తనదైన శైలిలో బౌలింగ్ వేసి ఆస్ట్రేలియా బ్యాటింగ్‎కు చెమటలు పట్టించి.. ఐదు వికెట్లు తీసిన మరో హీరో మహ్మద్‌ సిరాజ్‌లు గురువారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

తన ఇంటి బాల్కనీలో సిరాజ్

క్రికెటర్లకు అభిమానులు పుష్ప గుచ్ఛాలను ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌.. సిరీస్‌ ముగిసే సరికి భారత్‌ తరపున అత్యధిక వికెట్లు (13) తీసిన వీరుడిగా నిలిచాడు. రెండు టెస్టుల అనుభవంతోనే చివరి మ్యాచ్‌లో భారత బౌలింగ్‌ దళాన్ని సమర్థంగా నడిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ మాత్రమే తీసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అయిదు వికెట్లతో విజృంభించాడు. ఇప్పుడు అందరి చేత ప్రశంసలు పొందుతున్న అతను.. ఈ స్థాయికి చేరడం వెనక తన తండ్రి కష్టం ఉంది.

సిరాజ్ తన ఆస్ట్రేలియా పర్యటనపై సాయంత్రం 5 గంటలకు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్వదేశీ పర్యటనలో ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం సిరాజ్ ఇంగ్లాండ్‎తో జరిగే టెస్ట్ సిరీస్‎లో పాల్గొననున్నాడు.

Last Updated : Jan 21, 2021, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details