ప్రస్తుత భారత టెస్టు క్రికెటర్లలో నిలకడైన ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటారు విరాట్ కోహ్లీ, రహానే. మరి వారిద్దరూ ఆట గురించి కాకుండా తాజాగా వంటకాల గురించి మాట్లాడారు. విరాట్ ప్రత్యర్థి వేసే బంతిని పూరీతో పోలిస్తే... రహానే వడాపావ్‌ను ఏ చట్నీతో తింటే మంచిదని ప్రశ్నించాడు.
విరాట్ పూరీపైనే దృష్టి...
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. జిమ్‌లో కసరత్తులు చేయకుండా ఒక్కరోజూ ఉండడట. ఆహారానికీ అంతే ప్రాధాన్యం ఇస్తాడు. కెలొరీలు లెక్కలేసుకొని మరీ తింటాడు. నోరు ఊరుతుంది కదా అని తీపి, పిండి, కొవ్వు పదార్థాల జోలికి అస్సలు వెళ్లడు. శీతల పానీయాల సంగతి సరేసరి. విదేశాల నుంచి మంచినీరు తెప్పించుకుంటాడు.
దేహ దారుఢ్యం, ఆహారం విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉండే విరాట్ గురువారం సోషల్ మీడియాలో పంచుకున్న ఓ సంగతి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే బౌలర్ విసిరే బంతిపై అతడు తీక్షణంగా దృష్టి సారిస్తాడు. అంతే తీవ్రత తనకు పూరీ, శెనగల కూర పైనా ఉంటుందట.
" బౌలర్ చేతుల్లోంచి విడిచిన బంతి, ఛీట్ మీల్‌కు పూరీ, శెనగల కూరపై ఒకే రకమైన శ్రద్ధ అవసరం" అని ఇన్‌స్టాలో పెట్టాడు. ఈ పోస్టుపై అభిమానుల నుంచి భారీగా నవ్వు తెప్పించే రీట్వీట్లు వస్తున్నాయి. తమకూ ఆ వంటకం ఎంతో ఇష్టమని అంటున్నారు.
సాధారణంగా దిల్లీలో నివసించే వారు ఈ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. గతంలోనూ 'బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే కార్యక్రమంలో రాజౌరీ గార్డెన్‌లో పూరీ, శెనగల కూర రుచి గురించి విరాట్ ఎంతో గొప్పగా చెప్పాడు.