తెలంగాణ

telangana

ETV Bharat / sports

వలసకూలీల ఆకలి తీర్చిన క్రికెటర్​ షమి

టీమిండియా పేసర్​ మహ్మద్​ షమి వలసకూలీలపై దాతృత్వం చూపించాడు. లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు ఆహారం, మంచినీళ్లు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాడు.

Shami distributes food and water
వలసకూలీలపై షమి దాతృత్వం.. ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటు!

By

Published : Jun 2, 2020, 1:54 PM IST

భారత స్టార్​ క్రికెటర్​ మహ్మద్​ షమి తన సహృదయాన్ని చాటుకున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలకు.. ఆహారం, మాస్కులు పంపిణీ చేశాడు. ఉత్తరప్రదేశ్ షహాస్​పుర్​లోని తన స్వగృహం వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ట్విట్టర్​లో షేర్​ చేసింది బీసీసీఐ. ఇలాంటి విపత్కర సమయంలో "అందరం తోడుగా ఉన్నాం" అని భరోసానిచ్చింది.

వలసకూలీలపై షమి దాతృత్వం

ఇటీవలె మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ తన ఇంట్లో తయారు చేసిన భోజనాన్ని వలసకూలీలకు అందజేశాడు. ఇప్పటికే బీసీసీఐ సహా పలువురు క్రికెటర్లు కలిసి పీఎం కేర్స్​కు భారీ విరాళం అందజేశారు.

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలకు చేరువవగా.. మహమ్మారి కారణంగా 5వేల 500 మందికి పైగా బలయ్యారు.

ఇదీ చూచండి: వలసకూలీలకు సెహ్వాగ్​ వంటింటి భోజనం

ABOUT THE AUTHOR

...view details