తెలంగాణ

telangana

ETV Bharat / sports

కుక్కతో భువనేశ్వర్​ ఫ్రెండ్​షిప్​.. నెటిజన్లు ఫిదా - భువనేశ్వర్ కుమార్ తాజా వార్తలు

భారత బౌలర్​ భువనేశ్వర్, తన పెంపుడు శునకంతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్​లో పంచుకున్నాడు​. వీటిలో భువీ, అలెక్స్​ల హావభావాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Indian cricketer Bhuvneshwar Kumar posts ‘then and now’ pictures with his doggo.
కుక్కతో భువనేశ్వర్​ ఫ్రెండ్​షిప్

By

Published : Jun 8, 2020, 4:11 PM IST

మనిషికి బెస్ట్​ ఫ్రెండ్​ ఎవరు? అనే ప్రశ్నకు చాలా మంది ఇచ్చే సమాధానం 'శునకం'. ఎందుకంటే కుక్క ఒక్కసారి మనిషిని నమ్మితే.. జీవితాంతం విశ్వాసం చూపిస్తుంది. ఎలాంటి ఆపదల్లోనైనా మనకు తోడుగా ఉంటుంది. అందుకే పెంపుడు జంతువుగా చాలా మంది దీనినే ఎంచుకుంటారు. టీమ్​ఇండియా​ ఫాస్ట్​ బౌలర్ భువనేశ్వర్ కుమార్​.. ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ముద్దుగా 'అలెక్సో' అని పిలుచుకుంటాడు భువీ. దాని చిన్నతనం నుంచి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. తాజాగా దానితో తన స్నేహానికి గుర్తుగా ఉన్న ఓ ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నాడు. "స్నేహితులు ఒకప్పుడు, ఇప్పుడు" అనే వ్యాఖ్యను​ జోడించాడు.

రెండు చిత్రాలను గమనిస్తే.. గతంతో పోలిస్తే అలెక్స్ బొద్దుగా తయారయినట్లు కనిపిస్తోంది. రెండు ఫొటోల్లోనూ ఒకే ఫోజులో ఉన్న భువి, అలెక్సోల ఎక్స్​ప్రెషన్స్​కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే దాదాపు 3.5లక్షల మందికిపైగా ఈ ఫొటోను లైక్​ చేయగా.. 1000కి పైగా కామెంట్లు వచ్చాయి.

ఇదీ చూడండి : కోహ్లీ, రోహిత్ నాకు పెద్దన్నల్లాంటి వారు: చాహల్

ABOUT THE AUTHOR

...view details