టీమిండియా బౌలింగ్ విభాగంపై ప్రశంసలు కురిపించాడు దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్. ప్రస్తుతం భారత ఫాస్ట్ బౌలర్లు ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాణిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ జట్టులో చోటు దక్కించుకున్నాడీ సఫారీ జట్టు సీనియర్ బౌలర్. అనంతరం అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.
మీ ఫేవరెట్ బ్యాట్స్‌మన్ ఎవరని స్టెయిన్‌ను ఓ నెటిజన్ అడిగ్గా... ముగ్గురి పేర్లను వెల్లడించాడు. క్వింటన్ డికాక్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ అని తెలిపాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో డికాక్, డివిలియర్స్‌తో ఆడిన అనుభవం స్టెయిన్ సొంతం. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున కోహ్లీ కెప్టెన్సీలోనూ ఆడాడు. అందుకే ముగ్గురి బ్యాట్స్‌మెన్‌తోనూ అతడికి బలమైన అనుబంధం ఉంది.