వివాదాస్పద గురువు నిత్యానంద ఇటీవలే ఒక దీవిని కొనుగోలు చేసి, దానిని రాజకీయేతర హిందూ దేశంగా గుర్తించాలని తెలిపారు. ఈ విషయంపై ఐక్యరాజ్య సమితికీ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి 'కైలాసం' అనే పేరు పెట్టారు.ఆ దేశానికి ప్రధాని, రాష్ట్రపతితో సహా ప్రత్యేక జెండా, జాతీయ చిహ్నం, పాస్‌పోర్టులు కూడా ఉంటాయని చెప్పారు. ఈ విషయంపై టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. నిత్యానందకు ట్విట్టర్ వేదికగా చురకలంటించాడు.
'నిత్యానందా.. 'కైలాసం' రావాలంటే వీసా ఎలా..?' - #Kailaasa news
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. వివాదాస్పద గురువు నిత్యానందపై సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్ చేశాడు. ఇది నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
'కైలాసం' రావాలంటే వీసా ఎలా..?
" అక్కడికి రావాలంటే వీసా ఎలా తీసుకోవాలి?లేదా వీసా ఆన్ అరైవల్ ఇస్తారా?" అని పోస్టు చేశాడు. ఇది చూసిన అభిమానులు తెగ లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు.
నిత్యానంద ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన నేపథ్యంలో.. గుజరాత్ పోలీసులు ఆయనపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు.