తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ గెలిచి​ ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ - జేసన్ హోల్డర్

టీమిండియాతో తొలి టెస్టులో టాస్​ గెలిచిన వెస్టిండీస్​ బౌలింగ్ ఎంచుకుంది. విండీస్​ తరఫున భారీకాయుడు రకీమ్ కార్న్​వాల్​ అరంగేట్రం చేయనున్నాడు.

తొలి టెస్టు:టాస్​ కోహ్లీసేనదే..విండీస్​ బ్యాటింగ్

By

Published : Aug 22, 2019, 7:13 PM IST

Updated : Sep 27, 2019, 9:55 PM IST

టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా టీమిండియా తన తొలి సిరీస్​ ఆడేందుకు సిద్ధమైంది. ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్​తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​కు వర్షం అంతరాయం కలిగించడం వల్ల మ్యాచ్​​ ఆలస్యమైంది. అనంతరం టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోల్డర్​ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఆంటిగ్వా మైదానం

ఇప్పటికే టీ20, వన్డే సిరీస్​లు గెలిచిన కోహ్లీసేన.. టెస్టు సిరీస్​లోనూ విజయం సాధించి పర్యటనను ఘనంగా ముగించాలని చూస్తోంది. అదే విధంగా కొత్త టెస్టు జెర్సీల్లో బరిలోకి దిగనున్నారు ఇరుజట్ల ఆటగాళ్లు.

జట్లు

భారత్: మయాంక్‌ అగర్వాల్‌, రాహుల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, బుమ్రా, ఇషాంత్‌ శర్మ

వెస్టిండీస్​: జేసన్​ హోల్డర్(కెప్టెన్), బ్రాత్​వైట్​, డారెన్ బ్రావో, హోప్, క్యాంప్​బెల్, బ్రూక్స్, కార్న్​వాల్, డౌరిచ్, గాబ్రియోల్, హెట్మయిర్, రోచ్

ఇది చదవండి: విరాట్​, బుమ్రాల సిక్స్​ప్యాక్​ పిక్.. యువీ ప్రశంసలు

Last Updated : Sep 27, 2019, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details