ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో పర్యటక జట్టును చిత్తుగా ఓడించి.. సిరీస్‌ను 3-1తేడాతో కైవసం చేసుకుంది కోహ్లీ సేన.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్- చివరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు - భారత్Xఇంగ్లాండ్

15:49 March 06
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్- చివరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు
సెంచరీ హీరో రిషభ్ పంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సిరీస్‌లో 32 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
కివీస్‌తో ఫైనల్లో..
ఫలితంగా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేయగా.. భారత్ 365 పరుగులకు ఆలౌటైంది. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పర్యటక జట్టు 135 రన్స్‌కే కుప్పకూలింది.