ముంబయిలో జరిగిన నిర్ణయాత్మక టీ20లో భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్‌పై 67 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ కోహ్లీ(70), రోహిత్(71), రాహుల్(91) పరుగుల వరద పారించారు. 2-1 తేడాతో సిరీస్ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది భారత్. ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగారు ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్. తొలి వికెట్‌కు 135 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు.
71 పరుగులు చేసిన రోహిత్.. తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్.. పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. అనంతరం రాహుల్‌తో కలిసిన కోహ్లీ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలో టీ20ల్లో 24వ అర్ధ సెంచరీచేశాడు.
చివరకు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది టీమిండియా. వెస్టిండీస్ బౌలర్లలో కాట్రెల్, పొలార్డ్, విలియమ్స్ తలో వికెట్ తీశారు.
అనంతరం 241 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన విండీస్. మొదట్లోనే ఓపెనర్లు సిమన్స్(7), కింగ్(5) సహా పూరన్(0) వికెట్లు కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన హెట్మయిర్తో కలిసిన కెప్టెన్ పొలార్డ్.. నాలుగో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తర్వాత 41 పరుగులు చేసి హెట్మయిర్ ఔటయ్యాడు.
క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ ఓ వైపు విఫలమవుతున్నా.. కెప్టెన్ పొలార్డ్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. అయితే 68 పరుగులే చేసి భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మిగతా వారిలో హోల్డర్ 8, వాల్ష్ 11, పియర్రే 6, విలియమ్స్ 13, కాట్రెల్ 4 పరుగులు చేశారు.
రికార్డులు
- ఈ మ్యాచ్‌లో 5 సిక్స్‌లు కొట్టిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో 400 సిక్స్‌లు మార్క్‌ను అధిగమించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.
- తానాడిన తొలి 10 ఓవర్లలో 116-0 చేసిన టీమిండియా.. రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.
- టీ20ల్లో ఐదో అత్యధిక పవర్ ప్లే స్కోరు(72-0) చేసింది కోహ్లీసేన.
- 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ కోహ్లీ.. స్వదేశంలో టీ20ల్లో 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు.