తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్-కోహ్లీ దంచుడు.. వన్డే సిరీస్​ భారత్​దే - rohit sharma

బెంగళూరులో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. 2-1 తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది.

రోహిత్-కోహ్లీ దంచుడు.. వన్డే సిరీస్​ భారత్​దే
భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే

By

Published : Jan 19, 2020, 9:04 PM IST

Updated : Jan 19, 2020, 9:33 PM IST

నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్​ను​ 8 వికెట్ల తేడాతో గెలిచి, 2-1 తేడాతో సిరీస్​ దక్కించుకుంది కోహ్లీసేన. ఆసీస్​ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలుండగానే ఛేదించింది. రోహిత్ శర్మ, స్మిత్.. ఈ మ్యాచ్​లో శతకాలతో చెలరేగారు.

వికెట్ తీసిన ఆనందంలో భారత ఆటగాళ్లు

287 పరుగల ఛేదనలో భారత్​కు శుభారంభం దక్కింది. తొలి వికెట్​కు రాహుల్-రోహిత్ శర్మ జోడీ.. 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 19 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ ఔటయ్యాడు.

ఆ తర్వాత కోహ్లీతో కలిసిన రోహిత్.. నెమ్మదిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డేల్లో 9000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు హిట్​మ్యాన్. తక్కువ మ్యాచ్​ల్లో ఈ రికార్డు అందుకున్న వారిలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే తన వన్డే కెరీర్​లో29వ సెంచరీ నమోదు చేశాడు. లంక బ్యాట్స్​మెన్ సనత్ జయసూర్యను అధిగమించాడు. 119 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

వన్డేల్లో 9000 పరుగుల మైలురాయిని అందుకున్న రోహిత్ శర్మ

మరో ఎండ్​లో ఉన్న కోహ్లీ.. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ, వేగంగా ఆడాడు. 89 పరుగులు చేసి ఔటై, కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు. కానీ కెప్టెన్​గా అతి తక్కువ ఇన్నింగ్స్​ల్లో వన్డేల్లో 5000 పరుగుల మార్క్​ను అందుకున్న వాడిగా నిలిచాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్(44), మనీశ్ పాండే(4) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా, హేజిల్ వుడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ తీశారు.

కెప్టెన్​గా వన్డేల్లో 5000 పరుగులు చేసిన కోహ్లీ

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్-ఫించ్ త్వరగా ఔటయ్యారు. ఆ తర్వాత స్మిత్-లబుషేన్​ చక్కగా ఆడారు. మూడో వికెట్​కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత అర్ధ సెంచరీ చేసిన లబుషేన్ ఔటయ్యాడు. స్మిత్ 131 పరుగులు చేసిన పెవిలియన్ బాట పట్టాడు.

వికెట్ తీసిన ఆనందంలో భారత ఆటగాళ్లు

మిగతా బ్యాట్స్​మెన్ అంతగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో షమి 4, జడేజా 2, కుల్​దీప్, సైనీ తలో వికెట్ పడగొట్టారు.

Last Updated : Jan 19, 2020, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details