తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్-19 ఆసియాకప్ విజేత భారత్ - india

కొలంబో వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్​లో భారత్ విజేతగా నిలిచింది. బంగ్లాతో తుదిపోరులో 5 పరుగుల తేడాతో నెగ్గింది. టీమిండియా బౌలర్ అధర్వ 5 వికెట్లు తీసి మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

అండర్ -19 భారత్

By

Published : Sep 14, 2019, 8:09 PM IST

Updated : Sep 30, 2019, 3:07 PM IST

అండర్​-19 ఆసియాకప్​ విజేతగా భారత్ నిలిచింది. కొలంబో వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన తుదిపోరులో టీమిండియా కుర్రాళ్లు విజయం సాధించారు. బంగ్లాదేశ్​తో జరిగిన ఫైనల్లో ఐదు పరుగుల తేడాతో గెలిచారు. 5 వికెట్లతో విజృంభించిన భారత బౌలర్​ అధర్వకు మ్యాన్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్​.. బంగ్లా బౌలర్ల ధాటికి 32.4 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాట్స్​మెన్ ధ్రువ్(33), కరన్​లాల్(37) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మృత్యుంజయ్, షమీమ్ చెరో 3 వికెట్లు తీశారు.

యువ భారత్

అనంతరం బరిలో దిగిన బంగ్లా 101 పరుగులకు కుప్పుకూలింది. అధర్వ కేవలం 28 పరుగులే ఇచ్చి 5 వికెట్లతో విజృంభించాడు. అతడి స్పిన్ దెబ్బకు బంగ్లా బ్యాట్స్​మెన్ పెవిలియన్​కు క్యూ కట్టారు. ఆకాశ్ సింగ్ 3 వికెట్లు తీసి తన వంతు పాత్ర పోషించాడు. బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ 21 పరుగులే అత్యధికం.

ఇదీ చదవండి: హరియాణా స్పోర్ట్స్ వర్సిటీ ఛాన్సలర్​గా కపిల్​దేవ్​

Last Updated : Sep 30, 2019, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details