తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ విధ్వంసం.. భారత్​ సునాయాస విజయం

బంగ్లాదేశ్​పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రోహిత్​ విధ్వంసం వల్ల రెండో టీ20లో గెలిచి.. సిరీస్​ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్​ ఆదివారం.. నాగ్​పుర్​లో జరగనుంది.

క్రికెటర్ రోహిత్ శర్మ

By

Published : Nov 7, 2019, 10:24 PM IST

బంగ్లాదేశ్​పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. తొలి టీ20లో ఓటమికి సమాధానంగా 8 వికెట్ల తేడాతో గెలుపొంది భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను 1-1తో సమం చేసింది. రోహిత్​ శర్మ విధ్వంసం సృష్టించడం వల్ల రాజ్​కోట్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ప్రత్యర్థిని చిత్తు చేసింది టీమిండియా.

వందో మ్యాచ్​లో సెంచరీ మిస్​

ఈ మ్యాచ్​లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. ధనాధన్ బ్యాటింగ్​తో 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. మిగిలిన వారిలో ధావన్ 31, శ్రేయాస్​ అయ్యార్​ 24,రాహుల్ 8 పరుగులు చేశారు.

85 పరుగులు చేసిన భారత తాత్కాలిక కెప్టెన్ రోహిత్​శర్మ

అంతకు ముందు బ్యాటింగ్​ చేసిన బంగ్లాదేశ్​.. 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. వికెట్లు పడుతుండటం వల్ల బ్యాట్స్​మెన్ ధాటిగా ఆడలేకపోయారు. మహ్మద్ నయీమ్ (36)దే అత్యధిక స్కోరు.

భారత్​ బౌలర్లలో చాహల్ 2, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

ఇది చదవండి: పొట్టి ఫార్మాట్​లో రోహిత్ శర్మ 'సెంచరీ'

ABOUT THE AUTHOR

...view details