దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు టీ20 పోరాటం నేటి నుంచి ప్రారంభంకానుంది. అయిదు టీ20 సిరీస్‌లో భాగంగా నేడు సూరత్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇటీవల మిథాలీ రాజ్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం వల్ల సారథ్య బాధ్యతలు చేపట్టింది హర్మన్ ప్రీత్ కౌర్.
ఇటీవల సఫారీ జట్టుతో వాళ్ల సొంతగడ్డపై తలపడిన మహిళా టీమిండియా... 5 టీ20ల్లో మూడింటిని గెలిచింది. ఇదే జోష్ కొనసాగించి స్వదేశంలో జరిగే సిరీస్‌లోనూ ఆ జట్టును ఓడించాలనే పట్టుదలతో ఉంది.
బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ రాణించడం కీలకం. బౌలింగ్‌లో శిఖా పాండే, దీప్తి శర్మ, అనుజ పాటిల్‌పై టీమిండియా ఆధారపడుతోంది.