టీ20ల్లో మరో అద్భుత విజయం సాధించింది మహిళా భారత్. పెర్త్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలిచింది. తొలి పోరులో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది టీమిండియా.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ రెండో విజయం - India Women vs Bangladesh Women match in T20 world cup
బంగ్లాదేశ్‌పై సమష్టిగా రాణించి విజయం దక్కించుకుంది మహిళా భారత్. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ, బౌలింగ్ పూనమ్ యాదవ్ రాణించారు.
![టీ20 ప్రపంచకప్‌లో భారత్ రెండో విజయం టీ20 ప్రపంచకప్‌లో భారత్ రెండో విజయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6189381-125-6189381-1582552828484.jpg)
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(39), జెమీమా రోడ్రిగ్జ్(34) రాణించారు. మెరుపు వేగంతో బౌండరీలు కొట్టిన షెఫాలీ.. ఉన్నంతసేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. పన్నా ఘోశ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరింది. బంగ్లా బౌలర్లలో సల్మా, పన్నా.. తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనలో బంగ్లా జట్టు.. నిర్ణీత ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది. ముర్షీదా ఖాతున్ 30, నిగర్ సుల్తానా 35 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ఉమెన్లో అందరూ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 3, అరుంధతి రెడ్డి 2, రాజేశ్వరి, శిఖా తలో వికెట్ పడగొట్టి సత్తాచాటారు.