వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి రెండు టీ20ల్లో బ్యాటింగ్‌తో అదరగొట్టిన భారత అమ్మాయిలు.. శుక్రవారం జరిగిన మూడో టీ20లో బౌలింగ్‌తో సత్తాచాటారు. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసింది విండీస్. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 59 పరుగులే చేసింది. రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసి కరీబియన్ జట్టు పతనాన్ని శాసించారు.
రోడ్రిగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..
అనంతరం బరిలోకి దిగిన టీమిండియా.. 3 వికెట్లు కోల్పోయి మూడు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 40 పరుగులతో ఆకట్టుకున్న టీమిండియా బ్యాట్స్ఉమన్ జెర్మియా రోడ్రిగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
గత రెండు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో రెచ్చిపోయిన షెఫాలీ వర్మ డకౌట్‌గా వెనుదిరగ్గా.. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 3 పరుగులే చేసింది.