భారత్-విండీస్ రెండో టెస్టులో ఆతిథ్య జట్టు కష్టాలకు ఎదురీదుతోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన భారత్.. ప్రత్యర్థిని 117 పరుగులకే కట్టడి చేసి.. 299 పరుగులు భారీ ఆధిక్యం సంపాదించింది. ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీసేన 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. భారత్ మొత్తం 467 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో అదరగొట్టిన తెలుగు ఆటగాడు హనుమ విహారీ రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకంతో సత్తాచాటాడు.