తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీపై గావస్కర్ అసహనం.. ఏం జరిగిందంటే..!

బంగ్లాదేశ్​తో జరిగిన డేనైట్ టెస్టులో టీమిండియా విజయం సాధించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. గంగూలీపై ప్రశంసలు కురిపించాడు. దీనిపై మాజీ క్రికెటర్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.

గావస్కర్

By

Published : Nov 25, 2019, 2:37 PM IST

Updated : Nov 25, 2019, 3:05 PM IST

బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా ఆదివారం ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్‌ కోహ్లీ.. గంగూలీపై ప్రశంసలు కురిపించాడు. తమ విజయానికి బీజం వేసింది బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ అని కొనియాడాడు. ఈ విషయంపై స్పందించిన మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అసహనం వ్యక్తం చేశాడు.

"ఇదో అద్భుతమైన విజయం, అయితే నేనొక విషయం చెప్పదల్చుకున్నా. భారత జట్టు విజయ పరంపర 2000 నుంచి దాదా జట్టుతో మొదలైందని కోహ్లీ అన్నాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడని తెలుసు. కాబట్టి దాదా గురించి కోహ్లీ మంచిగా చెప్పి ఉండొచ్చు. అయితే, భారత జట్టు 1970, 80ల్లోనూ విజయాలను నమోదు చేసింది. అప్పటికి కోహ్లీ పుట్టలేదు."
-గావస్కర్, టీమిండియా మాజీ ఆటగాడు

అప్పట్లో స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ గెలుపొంది టీమిండియా మంచి పేరు తెచ్చుకుందని అన్నాడు గావస్కర్.

"2000ల్లోనే క్రికెట్‌ ప్రారంభమైందని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు. కానీ భారత జట్టు 70ల్లోనే విదేశాల్లో విజయాలు నమోదు చేసింది. 1986లోనూ గెలుపొందింది. అప్పట్లోనే విదేశీ గడ్డపై సిరీస్‌లు డ్రా చేసుకుంది. ఇతర జట్లలాగే ఓటమిపాలైంది."
-గావస్కర్, టీమిండియా మాజీ ఆటగాడు

ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఇవీ చూడండి.. అనుష్క ఒడిలో కోహ్లీ.. ఫొటోలు వైరల్

Last Updated : Nov 25, 2019, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details