తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​తో వన్డే సిరీస్​.. అసలైన పోటీ రోహిత్, కోహ్లీ మధ్య! - 2019 Leading ODI Scorer

వెస్టిండీస్​తో మూడు వన్డేల సిరీస్..​ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో సత్తా చాటి లీడింగ్ స్కోరర్​గా ఈ ఏడాదిని ముగిద్దామనుకుంటున్నారు స్టార్ బ్యాట్స్​మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. 2019లో వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన వీరిద్దరి మధ్య ఉన్న ప్రస్తుత అంతరం 56 పరుగులు మాత్రమే.

India vs West Indies: Rohit Sharma threat looms large as Virat Kohli eyes massive world record
విరాట్ - రోహిత్

By

Published : Dec 15, 2019, 10:16 AM IST

Updated : Dec 15, 2019, 10:26 AM IST

గత రెండేళ్లుగా వన్డేల్లో టాప్​ స్కోరర్​గా నిలుస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇప్పుడతడికి రోహిత్ శర్మ పోటీ ఇస్తున్నాడు. ఇద్దరి మధ్య పరుగుల అంతరం తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్​తో వన్డే సిరీస్​లో ఎక్కువ పరుగులు చేసి, ఏడాదిని ముగించాలని ఈ ఇద్దరు బ్యాట్స్​మెన్ భావిస్తున్నారు. మరి ఈ రికార్డు ఎవరు సాధిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది 23 వన్డేలాడిన కోహ్లీ 64.40 సగటుతో 1288 పరుగులు చేశాడు. 25 మ్యాచ్​ల్లో రోహిత్ శర్మ 53.56 సగటుతో 1232 పరుగులు సాధించాడు. ఇద్దరి మధ్య పరుగుల అంతరం 56 పరుగులు మాత్రమే.

2019లో ఎక్కువ పరుగులు చేసిన టాప్​-5 వన్డే బ్యాట్స్​మెన్..

  1. విరాట్ కోహ్లీ: 23 మ్యాచ్​లు, 1288 పరుగులు, సగటు 64.40
  2. రోహిత్ శర్మ: 25 మ్యాచ్​లు, 1232 పరుగులు, సగటు 53.56
  3. ఆరోన్ ఫించ్: 23 మ్యాచ్​లు, 1141 పరుగులు, సగటు 51.86
  4. షాయ్ హోప్​: 25 మ్యాచ్​లు, 1123 పరుగులు, సగటు 56.15
  5. బాబర్ అజాం: 20 మ్యాచ్​లు, 1092 పరుగులు, సగటు 60.66

విండీస్​పై సత్తాచాటితే కోహ్లీ ప్రపంచ రికార్డు..

2019లో అత్యధిక పరుగులతో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న విరాట్.. ఇదే జోరు కొనసాగిస్తే వరుసగా మూడేళ్లు, ఎక్కువ పరుగులు సాధించిన వన్డే బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టిస్తాడు. ఇంతవరకు ఈ ఘనత ఎవరూ దక్కించుకోలేదు. విరాట్.. వన్డేల్లో మూడు సార్లు ఎక్కువ పరుగులు సాధించి, ఏడాది ముగించినప్పటికీ వరుసగా అయితే చేయలేదు.

విరా ట్​ కోహ్లీ

క్యాలెండర్​ ఇయర్లలో అత్యధిక పరుగులు చేసిన వన్డే బ్యాట్స్​మెన్​

  1. విరాట్ కోహ్లీ(భారత్​) - 2011, 2017, 2018
  2. డెస్మండ్ హెయన్స్​(వెస్టిండీస్​) - 1984, 1985, 1989
  3. సౌరభ్ గంగూలీ(భారత్​) - 1997, 1999, 2000
  4. కుమార సంగక్కర(శ్రీలంక) - 2006, 2012, 2014

మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఈ ఏడాది 2366 పరుగులు చేశాడు. ప్రస్తుతం లీడింగ్ రన్ స్కోరర్​గా ఉన్న విరాట్ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ(2184) ఉన్నాడు. అనంతరం బాబర్ అజాం(1820) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాదిలో ఇంకా మూడు వన్డేలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో విరాట్​, రోహిత్ ఇద్దరిలో ఎవరూ టాప్​లో నిలుస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది.

విరాట్ - రోహిత్

2016 నుంచి మూడు ఫార్మాట్లలో లీడింగ్ స్కోరర్​గా కోహ్లీ ముగిస్తున్నాడు. ఆ ఏడాది 2595 పరుగులు చేసిన కోహ్లీ తర్వాతి సంవత్సరం 2818, అనంతరం 2735 పరుగులతో హ్యాట్రిక్​ సాధించాడు. ఇప్పుడు నాలుగో ఏడాది, అదే జోరు కోనసాగించినప్పటికీ.. రోహిత్​ శర్మ అడ్డుగా ఉన్నాడు. ఇప్పటికే టీ20ల్లో ఇద్దరి స్కోర్లు సమంగా ఉన్న నేపథ్యంలో వన్డేల్లోనూ ఆ ఘనత సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు హిట్ మ్యాన్.

ఇదీ చదవండి: 'నేనూ ధోనీ అభిమానినే.. రిటైర్మెంట్​పై మహీనే మాట్లాడాలి'

Last Updated : Dec 15, 2019, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details