తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ను ఊరిస్తోన్న మరో రికార్డు - Rohit Sharma Four Shots

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డుపై కన్నేశాడు. టీ20ల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచేందుకు మరో నాలుగు సిక్సుల దూరంలో ఉన్నాడు హిట్​మ్యాన్.

రోహిత్

By

Published : Aug 2, 2019, 6:29 PM IST

ప్రపంచకప్​లో ఐదు సెంచరీలతో ఆకట్టుకున్నాడు టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ. పలు రికార్డులను నమోదు చేశాడు. ప్రస్తుతం రోహిత్ మరో రికార్డుపై కన్నేశాడు. టీ20ల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడినా నిలిచేందుకు మరో నాలుగు సిక్సుల దూరంలో ఉన్నాడు.

రోహిత్

వెస్టిండీస్-భారత్ మధ్య మొత్తం మూడు టీ20లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ఫ్లోరిడా వేదికగా శనివారం జరగనుంది. ఈ టీ20 సిరీస్​కు విండీస్ విధ్వంసకర ఓపెనర్ గేల్ దూరమయ్యాడు. ఇప్పుడు గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సుల రికార్డును చెరిపేసేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు.

ప్రస్తుతం టీ20ల్లో 102 సిక్సులతో మూడో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ. గప్తిల్ (103), గేల్ (105) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మంచి ఫామ్​లో ఉన్న రోహిత్​ వీరిని అధిగమించడం పెద్ద విషయమేమీ కాదని పలువురి అభిప్రాయం.

ఇది చూడండి:దిల్లీ క్యాపిటల్స్ ఫిజియోగా ప్యాట్రిక్

ABOUT THE AUTHOR

...view details